గోదావరిఖని, జనవరి 23 : నైనీ బొగ్గు టెండర్ల పంచాయితీ పక్కా కుట్రగా కనిపిస్తున్నదని, దొంగలకే తాళాలు ఇచ్చి విచారణ ఎలా చేస్తారని, సింగరేణి సంస్థ ఆఫీసర్తోనే న్యాయం ఎలా జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు.
విచారణ కమిటీలో ఒక ఆఫీసర్ సింగరేణి సంస్థకు చెందిన అధికారి అని, ప్రస్తుతం అతను ఢిల్లీలోని బొగ్గు మంత్రిత్వ శాఖలో మూడేండ్లు డిప్యుటేషన్లో ఉన్నారని, ఇక నైతికత ఎక్కడ ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో నిలదీశారు. సింగరేణిలో ఉండే ట్రేడ్ యూనియన్లను ఈ కమిటీ ఎందుకుపిలువడంలేదని ప్రశ్నించారు?