హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): గురుకుల సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాస్ అహ్మద్ సూచించారు. మైనారిటీ గురుకుల డిప్యూటీ వార్డెన్లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని బజార్‌ఘాట్ ఆసిఫ్‌నగర్ బాలుర జూనియర్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇలియాస్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని డిప్యూటీ వార్డెన్లకు దిశానిర్దేశం చేశారు.
హాస్టల్ మెయింటెనెన్స్, హైజీన్, ఆరోగ్యం, భద్రత, విద్యార్థుల సంక్షేమం, మెస్ నిర్వహణ, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాలల అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆర్గనైజేషన్ సెక్రటరీ రఫీయుద్దీన్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మైనార్టీ గురుకుల అసిస్టెంట్ సెక్రటరీ అబ్దుల్ ఖయ్యూం, హైదరాబాద్ రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్లు సయ్యద్ తాజుద్దీన్, మహ్మద్ మదానీతోపాటు విజిలెన్స్ అధికారులు రహీం, నహీమ్ పాల్గొన్నారు.