PG LAWCET | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే, తెలంగాణ): ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ లాసెట్ సిలబస్‌లో అధికారులు స్వల్పమార్పులు చేసి, కొత్తగా ఫ్యామిలీ లాను చేర్చారు. అంటే ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారు ఇప్పుడు ఫ్యామి లీ లా పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన లా, పీజీ లాసెట్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ణారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిలబస్‌ను ఆమోదించి, షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 25న షెడ్యూల్ విడుదల కానుండగా, మార్చి 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ పరీక్షను జూన్ 6న నిర్వహించనున్న విషయం తెలిసిందే.