Gangula Kamalakar | కరీంనగర్లో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తాం : మంత్రి గంగుల
406, 407 జీవోల కింద పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల నుండి మొత్తం రూ. 75 కోట్ల నిధులు మంజూరు
Gangula Kamalakar : కరీంనగర్ నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు అద్భుతంగా నిర్మించామని తెలిపారు. మిగిలిన రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా 406, 407 జీవోల కింద పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల నుండి మొత్తం రూ. 75 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. వాటిలో రూ.59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్ మండలాల్లో ఆరు కొత్త రోడ్లు వేస్తామని, వరదల కారణంగా దెబ్బతిన్న10 రోడ్లను బాగు చేస్తామని గంగుల పేర్కొన్నారు.
రూ.14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్ అండ్ బి రోడ్లను రెన్యూవల్ పనులను డిసెంబర్ లో ప్రారంభించి మార్చ్ 31లోపు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు సంబంధించి రూ.40 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని, రేపు దానికి సంబంధించిన జీవో విడుదల అవుతుందని మంత్రి గంగుల తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

