హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబరు 7 (నమస్తే తెలంగాణ ) : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లతో కూడిన నగర ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అధికారుల బృందం దక్షిణ కొరియాకు వెళ్లనున్నది. మూసీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఇతర అధికారులతో మంత్రులు దక్షిణ కొరియాలోని చియోంగేచియోన్ స్ట్రీమ్ పునరుద్ధరణ ప్రాజెక్టును సందర్శించనున్నారు. దక్షిణ కొరియాలోని సియోల్ మధ్యలో 5.84 కిలోమీటర్ల మేర చియోంగేచియోన్ స్ట్రీమ్ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు 15 మందితో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 26 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనున్నది.