జాతర నిర్వహణకు 110 కోట్లు
రెండేండ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు ఖర్చు చేస్తుందని రెవెన్యు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు.
- మంత్రులు పొంగులేటి, సీతక్క
తాడ్వాయి, ఫిబ్రవరి19: రెండేండ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు ఖర్చు చేస్తుందని రెవెన్యు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు. జాతరను అద్భుతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి పొంగులేటి హెలికాప్టర్లో మేడారం చేరుకోగా, అప్పటికే మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్ ఏర్పాట్లలో ఉన్నారు.
అనంతరం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి మంత్రులు, జిల్లా అధికారులు చేరుకోగా, దేవాదాయశాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతంతో తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి అమ్మవార్లకు ఎత్తుబెల్లం సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం గద్దెల ప్రాంగణంలో మీడియాతో మంత్రులు మాట్లాడారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు చెప్పారు. మహాజాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు 2 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అంచనాలు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగానే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వీఐపీలు తమ వాహనాల్లో ములుగు వరకు వచ్చి అక్కడే పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులోనే మేడారానికి రావాలని కోరారు. మహాజాతర పూర్తయిన తర్వాత ఖర్చులన్నీ ప్రజల ముందుంచుతామని, మిగతా సొమ్ముతో జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడుతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

