హైదరాబాద్ : క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం బుధవారం విందు ఇవ్వనున్నది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు నగర ఎమ్మెల్యేలు పరిశీలించారు. విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా సీఎం కేసీఆర్ జరుపుతున్నారన్నారు. క్రైస్తవులతో కలిసి విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే విందులో దాదాపు 12వేల మంది పాల్గొంటారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విందుకు హాజరయ్యే అతిథులంతా 5 గంటల వరకు చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేయనున్నట్లు వివరించారు.