హైదదరాబాద్ : నారాయణపేట(Narayanapeta) జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును(Sangambanda project) డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,(Bhatti Vikramarka) నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు. సంగంబండ ప్రాజెక్ట్‌లో గతంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు. అలాగే మక్తల్ నియోజక వర్గం నుంచి అన్ని ప్రతి పాదనలు ఆమోదిస్తామని హామీనిచ్చారు.