జనగామ, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : దేవాదుల రిజర్వాయర్ల నుంచి సాగునీరందక జనగామ నియోజకవర్గం లో పంట పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోని అధికార పార్టీ నేతలు అమాయక రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలోని పలు గ్రామా ల్లో ఎండిన పొలాలు పశువులకు మేతగా మారిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్య క్తంచేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మసాగర్ నుంచి గండి రామారం రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్ చేయాల్సిన మోటర్లు 15 రోజులుగా బంద్ చేస్తే, అధికార పార్టీకి చెందిన మం త్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కూర్చున్నారని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యేగా ఈఎన్సీ అనిల్‌కుమార్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సెక్రటరీ రాహుల్‌బొజ్జాను అనే క సార్లు కలిసి ఓఅండ్ఎం స్టాఫ్‌కు ఇవ్వాల్సిన బకాయిలను ఇప్పించి మోటర్లను ఆన్ చేయించినట్టు తెలిపారు. గండి రామారం రిజర్వాయర్‌కు రావాల్సిన లైనులో ఔట్ లెట్లు ఉన్న అన్ని ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయని పేర్కొన్నారు. ఔట్లెట్లకు పోగా వచ్చే నీళ్లు గండి రా మారం రిజర్వాయర్‌కు చేరుకొని, అక్కడి నుంచి బొమ్మకూరు, కన్నెబోయిన గూడెం, వెల్దండ, లద్దునూరు, తపాస్‌పల్లి రిజర్వాయర్లను నింపాల్సి ఉందన్నారు. వీటి ద్వారా జనగామ నియోజకవర్గంలోని 80 శాతం ఆయకట్టుకు నీరు అందాల్సిన అవసరం ఉందని పల్లా తెలిపారు. 15 రోజుల పాటు ఓఅండ్ఎం స్టాఫ్ మోటర్లు బంద్ చేస్తే పట్టించుకోని అధికార పార్టీ నాయకులు ఈ రోజు మోటర్లను ఆన్ చేయగానే ‘తగుదునమ్మ’ అంటూ గండి రామారం రిజర్వాయర్ దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అమాయక రైతుల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటన్నారు.