సిద్దిపేట : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఏడో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా .. మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్దిపేట చింతల్ చెరువులో మంత్రులిద్దరూ కలిసి 52 వేల చేప పిల్లలు వదిలారు. మంత్రుల వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు మంత్రులు గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు.