హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన నెలకొల్పిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని రూపొందించిన విగ్రహ శిల్పి(sculptor) మహారాష్ట్రకు చెందిన అనిల్ సుతార్ ను రాష్ట్ర మంత్రులు సన్మానించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar), రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth reddy) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున మేమొంటో అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానశిల్పి రామ్ సుతార్ (వంద ఏండ్లు) ఈరోజు కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో అనిల్ సుతార్‌ను సన్మానించారు. ఆయనతో పాటు ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి,ఈఈ రవీంద్ర మోహన్, ఆర్కిటెక్ట్ జయ్ కాక్టికర్, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్,కొండల్ రెడ్డి,వంశీవర్ధన్ రెడ్డి తదితరులను ప్రభుత్వం తరుపున సన్మానించారు. తమకు విలువైన సూచనలు చేస్తూ, అందరినీ సమన్వయం చేస్తూ అన్ని విధాల తోడ్పాటు, మనోధైర్యాన్ని ఇచ్చిన మంత్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు.