హైదరాబాద్: రాష్ట్ర అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి.. శాంతమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఓదార్చారు.