ఆ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది : మంత్రి వేముల
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
జిల్లాలోని నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో ఎమ్మెల్సీ కవిత దంపతులు, వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్మించిన ఆలయంలో.. రెండో రోజూ కొనసాగుతున్న రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి వేముల హాజరయ్యారు.

ఎమ్మెల్సీ కవిత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా,హోమం కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..ఆలయం ఎంతో వైభవంగా నిర్మించారని ప్రశంసించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 9న జరగనుందని పేర్కొన్నారు. వారి ఇష్టదైవమైన ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే విధంగా ధర్మ పరిరక్షణలో భాగంగా నిర్మించిన ఎమ్మెల్సీ కవిత దంపతులకు, కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

