తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 629 వంతెనలను మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.3,050 కోట్లు ఖర్చు చేస్తున్నటు వివరించారు. శాసనసభలో సభ్యులు హర్షవర్ధన్‌రెడ్డి, కాలె యాదయ్య, అజ్మీరా రేఖానాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే 372 వంతెనల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 257 వంతెనలు 2022 జూన్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ మీదుగా సోమశిల నది నుంచి నంద్యాల వరకు 170 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు తొమ్మిది నెలల్లో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.