హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ (Bandi Sanjay) పై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ కుట్రలకు పాల్పడింది స్వయంగా బండి సంజయేనని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్ చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలనేది బండి సంజయ్ కుట్ర అని వేముల మండిపడ్డారు.
ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటోలు తీసి, బీజేపీ నేతలకు పంపింది ప్రశాంత్ అనే వ్యక్తని, అతను బీజేపీ కార్యకర్త అని మంత్రి చెప్పారు. బండి సంజయ్‌కి కూడా ప్రశాంత్ హిందీ ప్రశ్న పత్రాన్ని వాట్సాప్ చేశాడని అన్నారు. అంతేగాక కేవలం ఒక గంటలోనే ప్రశాంత్ 140 సార్లు బీజేపీ నేతలతో ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. బండి సంజయే పేపర్‌ను బయటికి తెప్పించి కేసీఆర్‌ను బద్నామ్ చేయాలని చూశాడని, కానీ పక్కా ఆదారాలు లభించడంతో పోలీసులు బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని చెప్పారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవడంపై కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. బండి సంజయ్‌ని అరెస్ట్ చేసినందుకు కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఎవరైనా సీఎం కేసీఆర్ జోలికొస్తే తాము భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని మంత్రి హెచ్చరించారు.
10వ తరగతి పేపర్ లీక్ కుట్రలకు పాల్పడింది బీజేపీ బండి సంజయ్ యే – VPR@BRSparty @KTRBRS @RaoKavitha @TSwithKCR @BRSHarish @BRSTechCell pic.twitter.com/jQ2NtMEVXz
— Vemula Prashanth Reddy (@VPR_BRS) April 5, 2023