మోర్తాడ్, జూలై 13 : రాత్రిపూట మూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్లీ అవసరమా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైతులను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మాటలపై ఆలోచన చేయాలని రైతులకు సూచించారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో రోడ్ల పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చి భరోసాగా నిలబడితే, కాంగ్రెసోళ్లు హాని తలపెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే, అనవసరంగా విద్యుత్తు ఇస్తున్నారని, మూడు గంటల కరెంటుచాలని రేవంత్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతకు సున్నం పెట్టాలని చూస్తున్న పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.