ఊటూర్, ఫిబ్రవరి 28: పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా ఊ టూర్ మండలం పులిమామిడిలో విద్యుత్ సబ్స్టేషన్ భూమిపూజకు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ త్రివేణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు.
తనను చంపాలని ప్రయత్నించారని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. అవమానాలు, బెదిరింపులకు భయపడకుండా పనిచేస్తానని స్పష్టంచేశారు. ‘చావు అనేది రామలింగేశ్వరస్వామి ఇయ్యాలే.. చావు నిర్ణయం చేసేది భగవంతుడు ’ అంటూ కామెంట్ చేశారు.