హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా-2025’ కాన్ఫరెన్స్‌కు మంత్రి శ్రీహరి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను విడుదల చేశారు. ఆర్డీవో, తహసీల్దారుల పర్యవేక్షణలో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మత్స్యరంగంలో రాణించిన తెలంగాణ వాసి రాసమల్ల సత్యనారాయణకు ప్రపంచ ఆక్వాకల్చర్ అవార్డు లభించిం ది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపూర్‌కు చెందిన సత్యనారాయణకు మంత్రి వాకిటి శ్రీహరి అవార్డు అందజేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.