హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి సలమడ పురుషోత్తంరెడ్డి(82) కన్నుమూశారు. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని కొండాపూర్‌లోని సైబర్ మీడోస్లోని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. పురుషోత్తంరెడ్డి ఆర్సీపూర్లోని బీహెచ్ఈఎల్లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, ఏపీపీసీసీ చీఫ్ షర్మిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మహాప్రస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పరామర్శించారు.
కేటీఆర్ సంతాపం
రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్‌రెడ్డి మృతికి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్టు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.