పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సుందిళ్ల బ్యారేజ్‌ని(Sundilla Barrage) రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttamkumar Reddy) శుక్రవారం సందర్శించారు. అధికారులను పలు విషాయలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లలో మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.
జూన్ చివరికల్లా పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మేడిగడ్డలో ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్ ) బృందం బుధ, గురువారాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లను పరిశీలించి విచారణ జరుపనున్నారు.