హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయితో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. సమ్మక్కసాగర్ బరాజ్‌కు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. ఇందుకుగాను పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ)ఇవ్వాల్సి ఉన్నది. ఈ బరాజ్‌తో దాదాపు 136 ఎకరాలు ముంపునకు గురవుతుందని ఛత్తీస్‌గఢ్ ఆరోపిస్తూ ఎన్వోసీ జారీకి కాలయాపన చేస్తున్నది. అయితే, తగిన పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు హామీ ఇచ్చారు.