హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో శనివారం సందడిగా జరిగింది. జాతీయ, ప్రముఖుల పేర్లతో ఈ అవార్డులను గ్రహీతలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఆర్ వెంకటరమణి ‘టెక్నాలజీ, లా, హ్యుమానిటీ’ అనే అంశంపై ప్రసంగించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ జస్టిస్ ఏకే పట్నాయక్ స్వాగతోపన్యాసం చేశారు.
అనంతరం నల్సార్ యూనివర్సిటీ రూపొందించిన నాలుగు నెలల ప్రాథమిక తెలుగు ఆన్లైన్ కోర్సును మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత జస్టిస్ లీసేథ్ రచించిన ‘వీ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా, ది ప్రియాంబల్ ఆఫ్ అవర్ కానిస్టూషన్’ అనే తెలుగు అనువాద పుస్తకాలనూ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ వినోద్ సేథీ, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జేఎస్ వర్మకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు.
జాతీయ అవార్డులు పొందిన వారు
1. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జేఎస్ వర్మ
2. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా జస్టిస్ దీపాంకర్ ప్రసాద్‌గుప్తా
3. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా (జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు)
4. ప్రొ గోవర్ధన్ మెహతా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు)
5. పరాగ్ పీ త్రిపాఠి, సీనియర్ న్యాయవాది, భారత సుప్రీంకోర్టు (కే వేణుగోపాల్ అటార్నీ జనరల్ జాతీయ అవార్డు)
6. ఎస్ఎస్ నాగానంద్, వైస్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అటార్నీ జనరల్ కే పరాశరన్ జాతీయ అవార్డు)
7. సీనియర్ జర్నలిస్ట్ దిలీప్‌రెడ్డి (ఎన్ నరోత్తమ్‌రెడ్డి జాతీయ అవార్డు)
8. హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంటల్ విభాగంలో జస్టిస్, యాక్టివిస్ట్ డాక్టర్ అల్లాణి కిషన్‌రావు (ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్‌కేర్ నేషనల్ అవార్డు)
9. డా కే తులసీరావు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (రిటైర్డ్) డైరెక్టర్ గ్లోబల్ బయో డైవర్సిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నేషనల్ అవార్డు)
10. డాక్టర్ నర్సింహారెడ్డి దొంతి పరిశోధకుడు, ప్రచారకర్త, పర్యావరణ న్యాయ కార్యకర్త (డాక్టర్ శివాజీరావు అవార్డు)
11. ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్, మాజీ డీన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు)