హైదరాబాద్, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఏజెన్సీ ప్రతినిధులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
సచివాలయంలో రాబిన్స్ కంపెనీ సీఈవో లాక్ హోమ్, సైట్ మేనేజర్ గ్లెన్‌తో గురువారం సమీక్షించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెండువైపులా బోరింగ్ మెషినరీ పొజిషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెండువైపుల నుంచి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి, డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.