హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడంతో వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఏర్పాటు చేసిన జాతీయ వంట నూనెల మిషన్ లక్ష్యాలను చేరుకోలేమని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం మే 31న క్రూడ్ పామాయిల్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 16.5% కి తగ్గించిందని లేఖలో ప్రస్తావించారు.