హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను బుధవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పరామర్శించారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద దవాఖాన (Yashodha Hospital)కు వెళ్లిన మంత్రి.. కేసీఆర్(KCR)ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకొని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఏడెనిమిది వారాల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు.