హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మారెటింగ్శాఖలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మారెటింగ్ శాఖలపై పూర్తి సమాచారంతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. మారెట్ యార్డుల్లో సమస్యల ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
వర్షాలు, ఇతర సమస్యలతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. అన్ని మారెట్ యార్డుల కార్యదర్శులతో త్వరలోనే టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని వెల్లడించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా మారెట్లు బాధ్యతతో పనిచేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రైవేటు కంపెనీల దందాను అరికట్టాలని, ఎకడా ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించా రు. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అవసరమైన చోట ఆయి ల్ ఫెడ్‌కు వ్యవసాయశాఖ నుంచి అధికారుల ను డిప్యుటేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీ సత్యశారద, మారెటింగ్ ఎండీ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు.