హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ) : సంక్రాంతిలోగా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి, అగ్రిడాక్టర్స్ డైరీ ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పదోన్నతులు లేకపోవడంతో వ్యవసాయాధికారులు నిరుత్సాహంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.