HomeTelanganaMinister Tummala Nageswara Rao Said There Should Be No Shortage Of Seeds
విత్తనాల కొరత రావద్దు
రైతులకు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): రైతులకు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. విత్తనాలు, పత్తి కొనుగోలుపై బుధవారం సచివాలయంలో అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.