హైదరాబాద్, జనవరి 7 (నమ స్తే తెలంగాణ): ‘ఎమ్మెల్యేలు, మం త్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులనే పట్టించుకోరా? ప్రజాప్రతినిధుల వినతులను పరిష్కరించలేనంత బిజీగా ఉన్నారా?’ అంటూ మా ర్కెటింగ్ శాఖ అధికారులపై వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మారెట్ కమిటీల పునర్విభజన కోసం వస్తున్న ప్రతిపాదనను దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచడంపై ఉన్నతోద్యోగిపై అసహనం వ్యక్తం చేశా రు. విజ్ఞప్తులను పరిశీలించి, మూడు రోజుల్లో నివేదిక పంపించాల్సిందిగా మారెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కు మార్ను ఆదేశించారు. సచివాలయం లో మంగళవారం వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
సాగు చేయని భూములెన్ని..?
రైతుభరోసా పథకం అమలుకు చ ర్యలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. వివిధ సాంకేతిక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన తుమ్మల.. మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లవారీగా సాగుయోగ్యంకాని భూముల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.