హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ విఫలమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సోమవారం విత్తనాల పంపిణీపై సమీక్షించిన మంత్రి మాట్లాడుతూ.. నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కు 12 జిల్లాల్లో 40వేల క్వింటాళ్ల విత్తనాల సరఫరా బాధ్యత అప్పగించినట్టు తెలిపారు. అయితే 1,000 టన్నులు మాత్రమే సరఫరా చేసినట్టు చెప్పారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాల కొరత ఏర్పడినట్టు పేర్కొన్నారు. ఈ 12 జిల్లాలకు కూడా తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు కేటాయించిన విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. కాబట్టి రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.