Minister Talasani | తెలంగాణలో యాదవులు సామాజికం, రాజకీయంగా ఎంతో అభివృద్ధి : మంత్రి తలసాని
Minister Talasani | తెలంగాణలో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav ) అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav ) అన్నారు. శుక్రవారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ యుద్ధభేరిలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు(Vote Bank) మాదిరిగానే చూశాయని, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది యాదవులకు ఎమ్మెల్యేలు(Mla’s)గా, రాజ్యసభ సభ్యుడి(MP) గా, కార్పొరేషన్ చైర్మన్లు (Corporations Chairmans) గా అవకాశం కల్పించి రాజకీయంగా పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తారనే ఆలోచన తో రూ.11 వేల కోట్ల వ్యయంతో సబ్సిడీపై గొర్రెల యూనిట్(Sheeps Units) లను పంపిణీ చేశారని వివరించారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్య, వసతి కల్పిస్తుందని చెప్పారు.
యాదవ సంఘం భవనం నిర్మాణం కోసం కోకాపీట లో అత్యంత ఖరీదైన కోట్లాది రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమి, భవన నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో యాదవుల అభివృద్ధి ని పట్టించుకోని పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు చలకాని వెంకన్న యాదవ్, శ్రీహరి యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, వివిధ జిల్లాల యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

