శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 15:05:38

బేగంబజార్‌లో హోల్‌సేల్‌ షాపుల ఓపెన్‌కు అనుమతిస్తాం

బేగంబజార్‌లో హోల్‌సేల్‌ షాపుల ఓపెన్‌కు అనుమతిస్తాం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బేగంబజార్‌ వ్యాపారస్తులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కిరాణా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నిత్యవసర వస్తువుల విక్రయాలకు సంబంధించి చర్చించారు. బేగంబజార్‌, సిద్ధంబర్‌ బజార్‌, కిషన్‌గంజ్‌, ఉస్మాన్‌ గంజ్‌ నుంచి రాష్ట్రం నలుమూలలకు నిత్యవసర సరుకులు హోల్‌సేల్‌ ధరలకు తరలిస్తుంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా దుకాణాలు మూసివేయడంతో.. నిత్యవసర సరుకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు రోజుకు 40 షాపులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హోల్‌సేల్‌ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తామని మంత్రి తలసాని చెప్పారు. ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే అనుమతిస్తామని, లేకపోతే షాపులు సీజ్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు.


logo