హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. సీఎంగా కేటీఆర్ ఎన్నిక కావడానికి ప్రధాని మోదీ అనుమతి తమకు అవసరం లేదని చెప్పారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద బుధవారం బీసీ కుల వృత్తిదారులకు లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హక్కులపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తమ పార్టీ, తమ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మోదీ వద్దకు తీసుకెళ్లాల్సిన అగత్యం తమకు పట్టలేదన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.