హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. కాగా, కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.
27 మంది తీవ్రంగా గాయపడ్డారు. కమలాపురలో వేగంగా వచ్చిన ఓప్రైవేట్ బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.