Minister Talasani Srinivas Yadav | హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
హుస్సేన్‌సాగర్‌లో (Hussain Sagar) గణనాథుల నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి (Khairtabad Ganesh) గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్‌బండ్‌లోని (Tank Bund) ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నది.
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో (Hussain Sagar) గణనాథుల నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి (Khairtabad Ganesh) గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్‌బండ్‌లోని (Tank Bund) ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నది. ప్రస్తుతం క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతికి పూజలు కొనసాగుతున్నాయి. కాగా, ట్యాంక్బడ్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి బోట్లో తిరుగుతూ నిమజ్జనం ఏర్పాట్లు, క్రేన్లను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో ఎల్బీ స్టేడియం, అబిడ్స్ వరకు నిమజ్జనం కోసం వచ్చిన వినాయకులు భారీగా నిలిచిపోయారు. ఇక సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్‌బండ్‌కు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలివచ్చారు. తీరొక్క వినాయక విగ్రహాలు, యువకుల నృత్యాలు, డీజే పాటలు, బ్యాండ్ సౌండ్లతో హైదరాబాద్ వీధులు మారుమ్రోగుతున్నాయి. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తికానుంది. అనంతరం వినాయకుల నిమజ్జనాలు ఊపందుకోనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

