నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు అక్కినినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నిందితురాలిగా ఉన్న మంత్రి కొండా సురేఖ శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కాలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటూ ఆమె తరఫు న్యాయవాది గైర్హాజరు పిటిషన్ను దాఖలు చేశారు. దీంతో కొండా సురేఖ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదని గుర్తుచేస్తూ.. ఈ నెల 9న జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.