Minister Srinivas Goud | సీఎం కేసీఆర్ పాలనలో పర్యాటక రంగానికి స్వర్ణ యుగం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పర్యాటక రంగం స్వర్ణ యుగంగా మారింది. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆదిమానవుడి కాలం నుంచి ఎన్నో చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక, వారసత్వ ఆధారాలు ఉన్నాయని ఎక్సైజ్, పర్యాటక శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పర్యాటక రంగం స్వర్ణ యుగంగా మారింది. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆదిమానవుడి కాలం నుంచి ఎన్నో చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక, వారసత్వ ఆధారాలు ఉన్నాయని ఎక్సైజ్, పర్యాటక శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక శాఖ , క్రీడా శాఖ, వారసత్వ శాఖలకు సంబంధించి పలు అభివృధి పనులకు వర్చువాల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంపదల పట్ల నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైంది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్, వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమం అభివృద్ధికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఎంతో చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటకు సమీపంలో ఉన్న ముడుమాల్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ పై రోప్ వే ను 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 17 గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

