హైదరాబాద్ : టోక్యో పారా ఒలింపిక్స్‌లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం క్రీడాకారులను కలిసిన ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. జావలిన్‌త్రోలో బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్, డిస్కస్‌త్రోలో రజతం సాధించిన యోగేష్ కతునియా, హై జంప్‌లో కాంస్యం గెలుపొందిన శరత్‌కుమార్‌లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Congratulated & welcomed javelin throw gold medallist Sumit Antil, silver-medallist in discus throw Yogesh Kathuniya at the Indira Gandhi International Airport in Delhi.#Tokyo2020 #Paralympics #SumitAntil #YogeshKathuniya @Media_SAI @Tokyo2020hi @IndiaSports @ianuragthakur pic.twitter.com/OR5c9rfrNt
— V Srinivas Goud (@VSrinivasGoud) September 4, 2021