హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నీరా ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా నీరా కేఫ్ పనుల పురోగతిపై, యాదాద్రి జిల్లాలోని నందనంలో ఏర్పాటు చేస్తున్న నీరా అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. ఈ నీరా ప్రాజెక్టును మార్చి నాటికి పూర్తయ్యేలా శర వేగంగా పనులను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఉన్నతాధికారులు అజయ్ రావు, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, అరుణ్ కుమార్, శీలం శ్రీనివాసరావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా నీరా కేఫ్ పనులు, యాదాద్రి జిల్లా లోని నందనం లో ఏర్పాటు చేస్తున్న నీరా అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/17StSTrJ2c
— V Srinivas Goud (@VSrinivasGoud) January 31, 2022