శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 11:06:10

బీసీలకు న్యాయం చేస్తున్నది కేసీఆర్‌ ఒక్కరే

బీసీలకు న్యాయం చేస్తున్నది కేసీఆర్‌ ఒక్కరే

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేస్తున్నది సీఎం కేసీఆర్‌ ఒక్కరే అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. మార్కెట్‌ చైర్మన్లు, నామినేటేడ్‌ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికొక బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం కోసం గతంలో ఎన్నో ధర్నాలు జరిగేవి. ఇప్పుడు సన్నబియ్యంతో కూడిన భోజనం పెడుతున్నామని చెప్పారు. విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుందన్నారు. ప్రతి పథకంలోనూ 90 శాతం మంది లబ్దిదారులు అణగారిన వర్గాల వారే ఉన్నారని మంత్రి తెలిపారు. 


logo