KTR | జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్
Alampur Jogulamba Temple | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ తాలూక బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది.
Alampur Jogulamba Temple | తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ తాలూక బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమవేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓడినా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సమవేశం అనంతరం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని కేటీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక కేటీఆర్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ విషయాన్ని తెలుపుతూ.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ పెట్టాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
Amidst all the running around as part of the campaign, had the privilege of wonderful darshan of Jogulamba Ammavaru at Alampur
Offered prayers for bountiful rains and the well being of Farmers pic.twitter.com/ziB7n86XhE
— KTR (@KTRBRS) April 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

