హయత్‌నగర్, డిసెంబర్ 20: నకిలీ మద్యం, మాదకద్రవ్యాల సరఫరాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాలో నకిలీ మద్యం కేంద్రాన్ని సీజ్ చేశామని, మద్యం బా టిళ్లు, అక్రమంగా సరఫరా చేసే ముఠాను పట్టుకొన్నట్టు పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ఆబ్కారీ పోలీస్‌స్టేషన్‌లో నకిలీ మద్యం తయారీ కేసు వివరాలను మంత్రి మీ డియాకు వివరించారు. కొందరు 3నెల ల కిందట తెలంగాణ నుంచి ఖాళీ సీసాలు, అట్టపెట్టెలు, లేబుళ్లు తీసుకెళ్లి ఒడిశాలో నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించారని పేర్కొన్నారు. యాచారం మండలం మొండి గౌరెల్లిలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ నెల 16న ఎక్సైజ్ అధికారులు చెట్లపల్లి రాజును అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ మద్యం తయారీ డొంక కదిలిందని తెలిపారు. హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీలో భూనేటి గోపీకృష్ణ దాచిన 120 మద్యం బాక్సులు, చౌటుప్పల్ మం డలం దేవలమ్మ నాగారంలో ఇంపీరియల్ బ్లూ 100 బాక్సులు, ఆఫీసర్ చాయిస్ 49 బాక్సుల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ.2.50 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చే సుకొన్నట్టు వెల్లడించారు. బింగి బాలరాజుగౌ డ్, అన్నేపల్లి కొండల్‌రెడ్డి వద్ద పోరండ్ల సం జయ్‌కుమార్ అనే వ్యక్తి కమీషన్ తీసుకొని నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు తెలిపారు.
సరిగ్గా దారి లేని ప్రాంతానికి వెళ్లి..
దారి కూడా లేని ఒడిశాలోని కటక్ జిల్లా టాంగి పరిధిలోని అభయ్‌పూర్ అటవీ ప్రాంతానికి తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ధైర్యంగా వెళ్లి నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టును రట్టు చేశారని మంత్రి చెప్పారు. ఆటోమేటెడ్ బాట్లింగ్ యంత్రాలు, ఆర్వో మి షన్, మద్యం బ్లెండ్ తయారు చేసే భారీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు, లేబుళ్లు, ఖాళీ సీసాలు, స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన సల్లుభాయ్, రంజిత్ సమల్, రాష్ర్టానికి చెందిన బింగి బాలరాజుగౌడ్, అన్నేపల్లి శివారెడ్డి అలియాస్ కొండల్‌రెడ్డి, నాగేశ్వరరావు, మణికం ఠ, పోరండ్ల సంజయ్‌కుమార్, మారమాండ సాయిప్రసాద్, భూనేటి గోపీకృష్ణ, చెట్లపల్లి రాజును అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రంగారెడ్డి నేతృత్వంలో 10 మంది బృందం ఈ గుట్టును బట్టబయలు చేసిందన్నారు.