సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ‘అరేయ్ సీఐ.. కాంగ్రెస్ అభ్యర్థి కా లర్ పట్టే దమ్ముందా నీకు..లం.. కొడుకా.. బీఆర్ఎస్ ఉ.. తాగుతున్నావా? చెంచానా కొడుకా’ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం సంగారెడ్డి సీసీఎస్ సీఐ శివకుమార్‌పై రాయలేని మాటలతో బూతుల వర్షం కురిపించారు. ‘నీ అంతుచూస్తా.. నేను అపోజిషన్‌లోకి మారినా నిన్ను వదల’ అంటూ సీఐని బెదిరించారు. అంతటితో ఊరుకోకుండా ఎన్నికల విధుల్లో ఉన్న హోంగార్డుపైనా బూతులతో విరుచుకుపడ్డారు. ‘అరేయ్.. ముందుకు రారా.. నీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరించడం సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కలకలం రేపింది.
కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టిన సీఐ ని సస్పెండ్ చేసే వరకు ఎన్నికలను బహిష్కరిస్తానంటూ పోలీసు అధికారులను జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామాలతో పట్టణంలోని రాజంపేటలో తీవ్ర ఉద్రిక వాతావరణం నెలకొన్నది. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, మరికొందరు పోలీసు అధికారుల సమక్షంలోనే సీఐ శివకుమార్, హోంగార్డును జగ్గారెడ్డి దూషించినా పోలీసులు ఏమి చేయకుండా ప్రేక్షకపాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నచ్చజెప్పినా వినకుండా..
సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు మధ్యాహ్నం బీఆర్ఎస్ వాళ్లు రిగ్గింగ్ చేస్తున్నారంటూ పోలిం గ్ బూతులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డును అక్కడే ఉన్న సీఐ నిలువరించి, రిగ్గింగ్ జరగడంలేదని, అనుమా నం ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యా దు చేయండని నచ్చజెప్పి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, సీఐ శివకుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుంటే అడ్డుకున్నారని, తమ గల్లాపట్టుకుని పోలీసులు బయటకు పంపారని జగ్గారెడ్డికి అడ్డు ఫోన్ చేసి చెప్పాడు.. దీంతో జగ్గారెడ్డి ఇంటి నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకొచ్చారు. జగ్గారెడ్డి వస్తూ వస్తూనే సీఐ శివకుమార్, హోంగార్డు యూసూఫ్‌ను బూ తులు తిడుతూ ఊగిపోయారు.
‘నా అభ్యర్థి అడ్డు గల్లా పట్టుకున్నాడు సీఐ. వాడెవ్వడు? మొగోడైతే నా ముందుకురావాలె. నా అభ్యర్థి గల్లా పట్టుకున్న సీఐ గురించి నాకు తెలుసు. శివకుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయకుంటే ఎన్నికలు ఆపేస్తానని, సంగారెడ్డిలో మొత్తం ఎన్నికలను బహిష్కరిస్తానని డీఎస్పీ సత్తయ్యగౌడ్ను హెచ్చరించారు. సంగారెడ్డిలో మరో ఇద్దరు సీఐలు బీఆర్ఎస్కు పనిచేస్తున్నారంటూ ఊగిపోయారు. ‘నాపేరు పెట్టి జగ్గారెడ్డి మొగోడా? అన్న బాస్టర్డ్ ఎవ్వడు? హోంగార్డు యూసుఫ్ అంట! వాడెవ్వడు? నా ముందుకు రమ్మనండి’ అంటూ రంకెలేస్తూ బూతులు తిట్టడం ప్రారంభించారు. దీంతో రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. చివరికి అదనపు ఎస్పీ రఘునందన్‌రావు వచ్చి జగ్గారెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులకు పోలింగ్ కేం ద్రాల్లోకి వెళ్లే అధికారం లేదని, సీఐ శివకుమార్ ఇతర పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తే దాన్ని ఎన్నికల అధికారులకు పంపిస్తామని, అదనపు ఎస్పీ తెలుపడంతో జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
నాల్సాబ్గడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జగ్గారెడ్డి, అక్కడ విధుల్లో ఉన్న సీఐ రమేశ్‌ను సైతం దూషించారు. ‘బీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నా మీరు ఆపడం లేదు. మీరు బీఆర్ఎస్ బ్రోకర్లుగా మారారు’ అంటూ తిట్టారు. సీఐ రమేశ్ స్పందించి.. ‘సర్, మేము మా విధులు పూర్తిగా నిర్వర్తిస్తున్నం..రిగ్గింగ్ జరగడం లేదు’ అని స్పష్టంచేశారు.