
హైదరాబాద్: ఆబ్కారీ అధికారులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే అంశంపై అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఇటీవల ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అధికారులతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లేకుండా చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్ ఈ భేటీ నిర్వహించినట్లు సమాచారం. సీఏం ఆదేశాల నేపథ్యంలో అధికారులతో ఈ విషయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.