Minister Srinivas Goud | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించిన సర్వాంగ సుందరంగా నిర్మించిన సస్పెన్షన్ వంతెనను వారం రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి వంతెనను పరిశీలించారు. ట్యాంక్‌బండ్ చుట్టూ ఉన్న ఐలాండ్ చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన సస్పెన్షన్ వంతెన ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.
ఈ మేరకు వారంలోగా చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా ఐలాండ్ వరకు చేరుకుని అక్కడ కొద్దిసేపు ఉండేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ, ఐలాండ్ అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రారంభించుకుంటామని చెప్పారు. మంత్రి వెంట రవి నాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.