కేసీఆర్‌తోనే దేశమంతా రైతు విప్లవం
- కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు
- బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాదని, దేశ రైతాంగం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తారని తెలిపారు. కేంద్రం వడ్లు కొనకుండా మోసం చేస్తున్నదనే విషయాన్ని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. రైతులను అప్రమత్తం చేశారన్నారు. కానీ తాము వడ్లు కొంటామని బీజేపీ నాయకులు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ వద్ద మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రైతులను తప్పుదారి పట్టించి పంట చేతికి వచ్చాక వడ్లు కొనకుండా మోసం చేశారని మండిపడ్డారు. అయినా కేసీఆర్ రైతులను ఆదుకొనేందుకు వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. బండి సంజయ్ యాత్రలో ప్రజలు ధరల విషయమై ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, తామే కట్టిస్తామని బీజేపీ నాయకులు అనేకమార్లు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికలలోపు మత కలహాలు, గొడవలు సృష్టించాలని బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

