మహబూబ్నగర్ : గత ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం దివిటి పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
వారికి వెంటనే నిత్యావసర సరుకులను మంత్రి సతీమణి శారదతో కలిసి పంపిణీ చేశారు.
ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి కల్పించారు.
గ్రామాల్లోనూ కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి వెంటనే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట దివిటిపల్లి సర్పంచ్ జరీనా, ఉపసర్పంచ్ వేమన తదితరులు ఉన్నారు.