నాటక రంగం చాలా గొప్పది
నాటకరంగం చాలా గొప్పదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువకళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నదని అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- కళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే
- యువనాటకోత్సవం ముగింపులో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
రవీంద్రభారతి, ఏప్రిల్ 24 : నాటకరంగం చాలా గొప్పదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువకళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నదని అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర) సంయుక్తంగా నిర్వహించిన నాలుగు రోజుల తెలంగాణ యువ నాటకోత్సవం ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా ముగిసింది. దీనికి మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హాజరై, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత నాటక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని చెప్పారు. తెలంగాణ యువ నాటకోత్సవం పేరిట యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. 600 మంది కళాకారులు 10 నాటికలను ప్రదర్శించారని పేర్కొన్నారు. యువ నాటకోత్సవానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి రూ.40వేల పారితోషికం అందిస్తున్నామని చెప్పారు. యువ నాటకోత్సవాన్ని గొప్పగా నిర్వహించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువకళాకారులను మంత్రి అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

