Rythu Bharosa | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల హామీ మాయమైంది. చివరకు రైతుభరోసాపై కూడా కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది.
నిన్న గంటల తరబడి జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు రైతుభరోసాపై నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి రైతుభరోసా ఎప్పుడు వేస్తారు అని అడగ్గా.. విని విననట్టు శ్రీధర్ బాబు వ్యవహరించారు. మరోసారి అదే అంశంపై జర్నలిస్టు ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా ఏంటండి అని శ్రీధర్‌బాబు అన్నారు. రైతుభరోసాపై సమాధానం చెప్పకుండా మంత్రి దాటవేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి తప్పని పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సి వచ్చింది.
ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు చేయాలి. ఖరీఫ్ (వానా కాలం) పంట అయిపోయిన తరువాత చూద్దాం అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాం. రైతుబంధుతో పాటు మిగతా హామీలను కూడా నెరవేరుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
రాబోయే ఖరీఫ్ పంటకు కూడా రైతు భరోసా లేనట్లే!
ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు కాలేదు ఖరీఫ్ (వానా కాలం) పంట అయిపోయిన తరువాత చూద్దాం – మంత్రి శ్రీధర్ బాబు pic.twitter.com/GWnoIU80ln
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024