ఐటీలో ఉద్యోగాలు తగ్గినయ్!
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగంలో 7,231 ఉద్యోగాలు తగ్గినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
- 2024-25లో 7,231 ఉద్యోగాలు ఊస్ట్
- టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగంలో 7,231 ఉద్యోగాలు తగ్గినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఉద్యోగాల్లో పురోగతి, గత 25 నెలల్లో రాష్ర్టానికి వచ్చిన ఎగుమతులు, ఉపాధి వివరాలపై ఎమ్మెల్సీ తాతా మధు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు బదులిచ్చారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. టాస్క్ ద్వారా నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు మద్దతు, ఐసీటీ, ఇమేజ్ పాలసీలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించారు. 2023-24లో రూ.2,68,233 కోట్లు, 2024-25లో రూ.3,12,941 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగినట్టు పేర్కొన్నారు. 2023-24లో 9,46,285 మంది ఐటీ రంగంలో ఉపాధి పొందగా.. 2024-25కి ఈ సంఖ్య 9,39,054కి తగ్గిందని తెలిపారు.
‘టీజీ ఐపాస్’ ద్వారా 3,903 కొత్త పరిశ్రమలు
గత రెండేండ్లలో రాష్ట్రంలో టీజీ ఐపాస్ ద్వారా 3,903 పరిశ్రమలకు అవసరమైన క్లియరెన్సులు ఇచ్చినట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఈ నూతన పరిశ్రమల ద్వారా 1,05,960 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

